Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

చూడుము ఈ క్షణమే కల్వరిని

Choodumu ee kshaname Kalvarini

ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను

prema prabhuvu neekai nilachundenu

గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు

goppa rakshnanivva sri Yesudu

సిలువలో వ్రేలాడు చున్నాడుగా

siluvalo vrelaadu chunnaaduga

సిలువలో వ్రేలాడు చున్నాడుగా (2)

siluvalo vrelaadu chunnaaduga (2)


మానవులెంతో చెడిపోయిరి

Maanavulentho Chedipoyiri

మరణించెదమని తలపోయక

Maraninchedhamani Thalapoyaka

ఎరుగరు మరణము నిక్కమని

Yerugaru Maranamu Nikkamani

నరకమున్నదని వారెరుగరు  (2) || చూడుము ||

Narakamunnadani Vaarerugaru (2) || Choodumu ||


ఇహమందు నీకు కలవన్నియు

Ihamandu Neeku Kalavanniyu

చనిపోవు సమయాన వెంటరావు

Chanipoovu Samanyaana Ventarravu

చనిపోయినను నీవు లేచెదవు

Chanipoyinanu Neevu Lechedhavu

తీర్పున్నదని యెరుగు ఒక దినమున (2) || చూడుము ||

Thirpunnadani Yerugu Oka Dinamu (2) || Choodumu ||


మనలను ధనవంతులుగ చేయను

Manalanu dhanavantulugaa cheyunu

దరిద్రుడాయెను మన ప్రభువు

daridrudaayenu mana prabhuvu

రక్తము కార్చెను పాపులకై

raktamu karchenu paapulakai

అంగీకరించుము శ్రీ యేసుని (2) || చూడుము ||

angikarinchumu sri yesuni (2) || Choodumu ||


సిలువపై చూడుము ఆ ప్రియుని

Siluvapai choodumu aa priyuni

ఆ ప్రేమకై నీవు యేమిత్తువు

Aa premakai neevu Yemithuvu

అర్పించుకో నీదు జీవితము

arpinchuko needu jeevitamu

ఆయన కొరకై జీవించుము (2) || చూడుము ||

aayana korakai jeevinchumu (2) || Choodumu ||