Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

దేవర నీ దీవెనలు

Devara Nee Deevenalu

ధారాళముగను వీరలపై

Dhaaraalamuganu Veeralapai

బాగుగ వేగమే దిగనిమ్ము

Baaguga Vegame Diganimmu

పావన యేసుని ద్వారగను (2)

Paavana Yesuni Dvaaraganu (2)


దంపతులు దండిగ నీ

Dampathulu Dandiga Nee

ధాత్రిలో వెలయుచు సంపదలన్

Dhaathrilo Velayuchu Sampadalan

సొంపుగ నింపుగ పెంపగుచు

Sompuga Nimpuga Pempaguchu

సహింపున వీరు సుఖించుటకై    ||దేవర నీ||

Sahimpuna Veeru Sukhinchutakai   ||Devara Nee||


ఈ కవను నీ కరుణన్

Ee Kavanu Nee Karunan

ఆకరు వరకును లోకములో

Aakaru Varakunu Lokamulo

శోకము లేకయే ఏకముగా

Shokamu Lekaye Ekamugaa

బ్రాకటముగను జేకొనుము      ||దేవర నీ||

Braakatamuganu Jekonumu       ||Devara Nee||


ఇప్పగిది నెప్పుడును

Ippagidi Neppudunu

గొప్పగు ప్రేమతో నొప్పుచు దా

Goppagu Prematho Noppuchu Daa

మొప్పిన చొప్పున దప్పకను

Moppina Choppuna Dappakanu

మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్   ||దేవర నీ||

Meppuga Brathukaga Bampu Krupan   ||Devara Nee||


తాపములు పాపములు

Thaapamulu Paapamulu

మోపుగ వీరిపై రాకుండగా

Mopuga Veeripai Raakundagaa

గాపుగ బ్రాపుగ దాపునుండి

Gaapuga Braapuga Daapunundi

యాపదలన్నియు బాపుచును    ||దేవర నీ||

Yaapadalanniyu Baapuchunu         ||Devara Nee||


సాధులుగన్ జేయుటకై

Saadhulugan Jeyutakai

శోధనలచే నీవు శోధింపగా

Shodhanalache Neevu Shodhinpagaa

కదలక వదలక ముదమున నీ

Kadalaka Vadalaka Mudamuna Nee

పాదము దాపున బాదుకొనన్     ||దేవర నీ||

Paadamu Daapuna Baadukonan       ||Devara Nee||


మెండుగ భూమండలపు

Menduga Bhoomandalapu

గండములలో వీరుండగను

Gandamulalo Veerundaganu

తండ్రిగ దండిగ నండనుండి

Thandriga Dandiga Nandanundi

వెండియు వానిని ఖండించావే     ||దేవర నీ||

Vendiyu Vaanini Khandinchave      ||Devara Nee||


యిద్దరు వీరిద్దరును

Iddara Veeriddarunu

శుద్ధులై నిన్ను సేవించుటకై

Shudhdhulai Ninnu Sevinchutakai

శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్

Shradhdhatho Budhdhiga Sidhdhapadan

దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్    ||దేవర నీ||

Didhdhumu Nee Priya Biddalugaan    ||Devara Nee||


వాసిగ నీ దాసులము

Vaasiga Nee Daasulamu

చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని

Chesina Ee Moral Deesikoni

మా సకలేశ్వర నీ సుతుడ

Maa Sakaleshwara Nee Suthuda

యేసుని పేరిట బ్రోవుమామేన్    ||దేవర నీ||

Yesuni Perita Brovumaamen        ||Devara Nee||