జుంటె తేనె కన్నా తియ్యనిది - వెండి పసిడికన్నా మిన్న అది
Junte Thene Kannaa Theeyanidi - Vendi Pasidi Kannaa Minna Adi
పొంగి పొర్లుచున్నా ప్రేమ నీది - యేసు నీ నామము
Pongi Porlu Chunna Prema Needi - Yesu Nee Naamamu
సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది - పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
Soorya Kaanthi Kannaa Prakaashamainadi - Pandu Vennela Kannaa Nirmalamainadi
మంచు కొండలకన్నా చల్లనిది - యేసు నీ నామము
Manchu Kondala Kannaa Challanidi - Yesu Nee Naamamu
యేసు అసాధ్యుడవు నీవు - మరణాన్నే జయించిన వీరుడవు
Yesu Asaadhyudavu Neevu - Maranaanne Jayinchina Veerudavu
సర్వాన్ని శాసించే యోధుడవు - నీకు సాటి లేరెవరు
Sarvannee Shaasinche Yodhudavu - Neeku Saati Lerevaru
రక్షకా నీవేగా మా బలము - దేవా మాదాగు స్థలము నీవే
Rakshakaa Neevegaa Maa Balamu - Devaa Maa Daagu Sthalamu Neeve
నీవే నిజమైన దేవుడవు - ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె తేనె||
Neeve Nijamaina Devudavu - Pranamelli Mrokkedamu ||Junte Thene||
ఆకాశముకన్న విశాలమైనది - విశ్వమంతటిలో వ్యాపించియున్నది
Aakaashamu Kannaa Vishaala Mainadi - Vishwamanthatilo Vyaapinchiyunnadi
ఊహలకందని ఉన్నతమైనది - యేసు నీ నామము
Oohalakandani Unnathamainadi - Yesu Nee Naamamu
లోకమంతటికి రక్షణ మార్గము - జనులందరిని బ్రతికించు జీవము
Lokamanthatiki Rakshana Maargamu - Janulandarini Brathikinchu Jeevamu
సర్వకాలములలో నివశించు సత్యము - యేసు నీ నామము ||యేసు అసాధ్యుడవు||
Sarva Kaalamulo Nivasinchu Sathyamu - Yesu Nee Naamamu ||Yesu Asaadhyudavu ||