కలువరి గిరిలో సిలువలో శ్రమలు నా కొరకై భరియించితివా
యేసయ్య నా యేసయ్య
ప్రేమామయుడా కృపగల తండ్రి
యేసయ్య నా యేసయ్య
కరుణామయుడా మా ప్రియ ప్రభువా
1. తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక క్షమించుమంటివి (2) || యేసయ్య...||
2. నేడే నీవు నాతో కూడా
పరదైసులో ఉందువని అభయమిచ్చితివా (2) || యేసయ్య...||
3. అమ్మా ఇదిగో నీ సుతుడనుచు
తల్లికే అప్పగించితివా (2) || యేసయ్య...||
4. నా దేవా దేవా నన్నేల విదిచితివని
తండ్రిని వేడితివ (2) || యేసయ్య...||
5. దప్పి గొనుచున్నపుడు
చేదు చిరక త్రాగనిచ్చిరా (2) || యేసయ్య...||
6. సమాప్తము అయినదని తల వంచి
గొప్ప శబ్దముతో ఆత్మనప్పగించితివా (2) || యేసయ్య...||
7. అప్పగింతు తండ్రి నా ఆత్మను నీకు అని
ఆర్భాటముతో ప్రాణమర్పించితివా (2) || యేసయ్య...||