నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
Naa Neethi Suryuda – Bhuvinelu Yesayya
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని (2)
Saripolchalenu Neetho -Ghanulaina Vaarini (2)
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
Raajulake Maha Raaraajuvu – Krupachupe Dhevudavu
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
Nadipinche Najareyudaa – Kaapaade Kaaparivi || Naa Neethi||
1. శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను
Sramalalo Bahu Sramalalo – Aadarana Kaliginchenu
వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
Vaakyame Krupa Vaakyame – Nanu Veedani Anubandhamai (2)
నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను
Nee Maatale Jaladhaaralai – Santhrupthinichhenu
నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను
Nee Maatale Oushadhamai Gaayamulu Kattenu
నీ మాటే మధురం || రాజులకే ||
Nee Maate Madhuram! ||Raajulake ||
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
Raajulake Maha Raaraajuvu – Krupachupe Dhevudavu
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
Nadipinche Najareyudaa – Kaapaade Kaaparivi || Naa Neethi||
2. మేలుకై సమస్తమును - జరిగించుచున్నావు నీవు
Melukai Samastamunu – Jariginchuchunnaavu Neevu
ఏదియు కొదువచేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
Yediyu Kodhuva Cheyavu – Ninaasrayinchina Vaarini (2)
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
Bheekaramaina Kaaryamulu – Cheyuchunna Vaada..
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా
Sajeevudavai Adhika Sthothramu Ponduchunna Vaada..
ఘనపరతును నిన్నే ||ప్రేమించే యేసయ్యా||
Ghanaparathunu Ninne! ||Preminche Yesayya ||
ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా
Preminche Yesayya – Neevunte Chaalunayya
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
Nadipinche Najareyuda – Kaapaade Kaaparivi ||Naa Neethi ||
3. సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని
Sanghamai Nee Swaasthyamai – Nanu Nee Yeduta Nilapaalani
ఆత్మతో మహిమాత్మతో - నను ముద్రించియున్నావు నీవు (2)
Aathmatho Mahimaathmatho – Nanu Mudrinchiyunnavu Neevu (2)
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
Varamulatho Phalamulatho Neekai Brathakaalani
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని
Thudiswaasha Nee Sannidhilo – Vijayam Chudaalani..
ఆశతో ఉన్నానయా ||కరుణించే యేసయ్యా||
Aashatho Vunnanaya! || Karuninche Yesayyaa ||
కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం
Karuninche Yesayyaa – Neekosame Naajeevitam
నిన్నుచేరే ఆశయం తీరాలయ్యా
Ninu Chere Aashayam Teeraalayya
నిన్నుచూసే ఆక్షణం రావాలయ్యా || నా నీతి ||
Ninu Chuse Aakshanam Raavaalayya || Naa Neethi||