నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు — 2
నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు
హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు......
1. పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2
ప్రభు కృప మమ్మును విడువదుగా ....
పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువదుగా ....
ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
2. మునుపటి కంటెను - అధికపు మేలును -2
మా ప్రభు మాకు కలిగించును -
మునుపటి కంటెను - అధికపు మేలును
మా ప్రభు మాకు కలిగించును
రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును
ప్రభువే మా ధ్వజము
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......