Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

రుచి చూచి యెరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)

Ruchi Choochi Erigithini – Yehovaa Uththamudaniyu (2)

రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)

Rakshaku Naashrayinchi – Ne Dhanyudanaithini (2)


గొప్పదేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)

Goppa Devudavu Neeve – Stuthulaku Paathruda Neeve (2)

తప్పక ఆరాధింతు – దయాళుడవు నీవే (2) || రుచి చూచి ||

Thaappaka Aaraadhinthun – Dayaaludavu Neeve (2) ||Ruchi Choochi||


మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా (2)

Mahonnathudavagu Devaa – Prabhaavamu Galavaadaa (2)

మనసారా పొగడెదను నీ – ఆశ్చర్య కార్యములన్ (2) || రుచి చూచి ||

Manasaara Pogadedanu Nee – Aascharya Kaaryamulan (2) ||Ruchi Choochi||


మంచితనముగల దేవా – అతిశ్రేష్టుడవు అందరిలో (2)

Manchi Thanamugala Devaa – Athishreshtudavu Andarilo (2)

ముదమార పాడెద నిన్ను – అతిసుందరుడవనియు (2) || రుచి చూచి ||

Mudamaara Paadeda Ninnu – Athi Sundarudavaniyu (2) ||Ruchi Choochi||


నా జీవితమంతయును – యెహోవాను స్తుతించెదను (2)

Naa jeevithamanthayunu – Yehovaanu Sthutyinchedanu (2)

నా బ్రతుకు కాలములో – నా దేవుని కీర్తింతున్ (2) || రుచి చూచి ||

Naa Brathuku Kaalamulo – Naa Devuni Keerthinthun (2) ||Ruchi Choochi||


సంతోషింతు నెల్లప్పుడు – కష్టదుఃఖబాదలలో (2)

Santhoshinthu Nellappudu Kasthadhukkabhadhalaloo (2)

ఎంతో నెమ్మదినిచ్చు – నా రక్షకుడు యేసు (2) || రుచి చూచి ||

Entho nemmadinechu Naa rakshakudu Yesu (2) ||Ruchi Choochi||


ప్రార్దింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)

Praardhinthunu Edathegaka – Prabhu Sannidhilo Cheri (2)

సంపూర్ణముగా పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి ||

Sampoornamuga Pondedanu – Aduguvaatannitini (2) ||Ruchi Choochi||


కృతజ్ఞత చెల్లింతు – ప్రతిదానికొరకు నేను (2)

Kruthagnathaa Chellinthun – Prathi Daani Koraku Nenu (2)

క్రీస్తునియందే త్రుప్తి – పొంది హర్షించేదను (2) || రుచి చూచి ||

Kreesthuni Yande Thrupthi – Pondi Harshinchedanu (2) ||Ruchi Choochi||