సర్వ చిత్తంబు నీదేనయ్యా
Sarva Chitthambu Needenayyaa
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
Swaroopamicchu Kummarive (2)
సారెపైనున్న మంటినయ్యా
Saarepainunna Mantinayyaa
సరియైన పాత్రన్ చేయుమయ్యా
Sariyainaa Paathran Cheyumayyaa
సర్వేశ్వరా నే రిక్తుండను
Sarvesvaraa Ne Rikthundanu
సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు||
Sarvadaa Ninne Sevinthunu ||Sarva Chitthambu||
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
Prabhuu! Siddhinchu Nee Chitthame
ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
Praardhinchuchunti Nee Sannidhi (2)
పరికింపు నన్నీ దివసంబున
Parikimpu Nannee Divasambuna
పరిశుభ్రమైన హిమము కన్నా
Parishubhramaina Himamu Kannaa
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
Parisuddhun Jesi Paalimpumaa
పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు||
Paapambu Pova Nanu Kadugumaa ||Sarva Chitthambu||
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
Nee Chitthame Siddhinchu Prabhuu
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
Ninne Praardhinthu Naa Rakshakaa (2)
నీఛమౌ గాయముల చేతను
Neechamou Gaayamula Chethanu
నిత్యంబు కృంగి అలసియుండ
Nithyambu Krungi Alasiyunda
నిజమైన సర్వ శక్తుండవే
Nijamaina Sarva Shakthundave
నీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు||
Nee Chetha Patti Nan Rakshimpumaa ||Sarva Chitthambu||
ఆత్మ స్వరూప నీ చిత్తమే
Aathma Swaroopa Nee Chitthame
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
Anishambu Chellu Iha Paramuna (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
Adhikambugaa Nan Nee Aathmatho
ఆవరింపుమో నా రక్షకా
Aavarimpumo Naa Rakshakaa
అందరు నాలో క్రీస్తుని జూడ
Andaru Naalo Kreesthuni Jooda
ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||
Aathmatho Nannu Nimpumu Devaa ||Sarva Chitthambu||