Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

యెహోవా నా బలమా

Yehovaa Naa Balamaa

యదార్థమైనది నీ మార్గం

Yadhaarthamainadi Nee Maargam

పరిపూర్ణమైనది నీ మార్గం (2)         ||యెహోవా||

Paripoornamainadi Nee Maargam

(2)  ||Yehovaa||

 

1.     నా శత్రువులు నను చుట్టిననూ

Naa Shathruvulu Nanu Chuttinanoo

నరకపు పాశములరికట్టిననూ (2)

Narakapu Paashamularikattinanoo (2)

వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)

Varadavale Bhakthiheenulu Porlina (2)

విడువక నను ఎడబాయని దేవా (2)     ||యెహోవా||

Vadalaka Nanu Edabaayani Devaa (2)  ||Yehovaa||

 

2.     మరణపుటురులలో మరువక మొరలిడ

Maranaputurulalo Maruvaka Moralida

ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)

Unnathadurgamai Rakshanasrungamai (2)

తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)

Thana Aalayamulo Naa Mora Vinenu (2)

ఆదరెను ధరణి భయకంపముచే (2)     ||యెహోవా||

Adarenu Dharani Bhayakampamuche (2)  ||Yehovaa||

 

3.     నా దీపమును వెలిగించువాడు

Naa Deepamunu Veliginchuvaadu

నా చీకటిని వెలుగుగా చేయును (2)

Naa Cheekatini Veluguga Cheyunu (2)

జలరాసులనుండి బలమైన చేతితో (2)

Jalaraasulanundi Balamaina Chethitho (2)

వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)   ||యెహోవా||

Velupala Cherchina Balamaina Devudu (2)  ||Yehovaa||

 

4.     పౌరుషముగల ప్రభు కొపింపగా

Pourushamugala Prabhu Kopimpagaa

పర్వతముల పునాదులు వణకెను (2)

Parvathamula Punaadulu Vanakenu (2)

తన నోటనుండి వచ్చిన అగ్ని (2)

Thana Notanundi Vachchina Agni (2)

దహించివేసెను వైరులనెల్లన్ (2)       ||యెహోవా||

Dahinchivesenu Vairulanellan

(2)         ||Yehovaa||

 

5.     మేఘములపై ఆయన వచ్చును

Meghamulapai Aayana Vachchunu

మేఘములను తన మాటుగ జేయును (2)

Meghamulanu Thana Maatuga Jeyunu (2)

ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)

Urumula Merupula Menduga Jesi (2)

అపజయమిచ్చును అపవాదికిని (2)    ||యెహోవా||

Apajayamichchunu Apavaadikini

(2)       ||Yehovaa||

 

6.     దయగలవారిపై దయ చూపించును

Dayagala Vaaripai Daya Choopinchunu

కఠినులయెడల వికటము జూపును (2)

Katinulayedala Vikatamu Joopunu (2)

గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)

Garvishtula Yokka Garvamunanuchunu (2)

సర్వమునెరిగిన సర్వాధికారి (2)       ||యెహోవా||

Sarvamu Nerigina Sarvaadhikaari

(2)      ||Yehovaa||

 

7.     నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును

Naa Kaallanu Ledi Kaalluga Jeyunu

ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)

Eththaina Sthalamulo Shakthitho Nilipi (2)

రక్షణ కేడెము నాకందించి (2)

Rakshana Kedemu Naakandinchi (2)

అక్షయముగ తన పక్షము జేర్చిన (2)   ||యెహోవా||

Akshayamuga Thana Pakshamu Jerchina (2) ||Yehovaa||

 

8.     యెహోవా జీవముగల దేవా

Yehovaa Jeevamugala Devaa

బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)

Bahugaa Sthuthulaku Arhuda Neeve (2)

అన్యజనులలో ధన్యత చూపుచు (2)

Anyajanulalo Dhanyatha Choopuchu (2)

హల్లెలూయ స్తుతిగానము చేసెద (2)    ||యెహోవా||

Hallelooya Sthuthigaanamu Cheseda (2)  ||Yehovaa||