యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
Yese Naa Parihaari - Priya Yese Naa Parihaari
నా జీవిత కాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
Naa Jeevitha Kaalamella - Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
ఎన్ని కష్టాలు కలిగిననూ - నన్ను కృంగించె భాదలెన్నో (2)
Yenni Kashtaalu Kaliginanoo - Nannu Krunginche Bhaadalenno (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
Yenni Nashtalu Vaatillinaa - Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
నన్ను సాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా (2)
Nannu Sathaanu Vembadinchinaa - Nannu Shathruvu Edirinchinaa (2)
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
Palu Nindalu Nanu Chuttinaa - Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
మణి మాన్యాలు లేకున్ననూ - పలు వేదనలు వేధించినా (2)
Mani Maanyaalu Lekunnanoo - Palu Vedanalu Vedhinchinaa (2)
నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
Narulellaru Nanu Vidachinaa - Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
బహు వ్యాధులు నను సోకినా - నాకు శాంతి కరువైనా (2)
Bahu Vyaadhulu Nanu Sokinaa - Naaku Shaanthi Karuvainaa (2)
నను శోధకుడు శోధించినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
Nanu Shodhakudu Shodhinchinaa - Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
Devaa Neeve Naa Aadhaaram - Nee Premaku Saatevvaru (2)
నా జీవిత కాలమంతా - నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||
Naa Jeevitha Kaalamanthaa - Ninnu Paadi Sthuthinchedanu (2) ||Yese Naa||