యేసు రక్తమే జయము జయము రా
Yesu rakthame jayamu jayamu raa
శిలువ రక్తమే జయము జయము రా
siluva rakthame jayamu jayamu raa
ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా (2) || యేసు ||
dhairyaanni, souryaanni nimpenuraa thana pakshamu nilabadina gelupu neede raa (2)|| Yesu ||
బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము
Balaheenulaku balamaina durgam, mukthi yesu rakthamu
వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము
vyaadi baadhalaku vidudala kaliginchunu svasthatha yesu rakthamu
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం (2)
saanthiki sthaavaram sree yesuni raktham-neethiki kavacham parisudhdhuni raktham (2)
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము
mruthyuvune… gelichina rakthamu… paathaalam muyu rakthamu
నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే || యేసు ||
narakaanni bandhichina jayasaali adhipathi raaraaju yesayye|| Yesu ||
పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…
Paapiki saranamu yesu rakthamu, rakshana praakaaramu
అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము
apavithraathmanu paaradrolunu khadgamu yesu rakthamu
శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
sathruvu nilivadu virodhi evvadu?-ye aayudhamu neepai vardhilladu (2)
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
saathaanne nalagagottina vaadithalane chithakakottinaa
కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే || యేసు ||
kodama simhamai meghaarudigaa theerpu theercha vachhu raaraaju yesayye|| Yesu ||