Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము

Devude Naakaashrayambu – Divyamaina Durgamu

మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును

Mahaa Vinodu Daapadala – Sahaayudai Nan Brochunu


అభయ మభయ మభయ మెప్పు

Abhaya Mabhaya Mabhaya Meppu

డానంద మానంద మానంద మౌగ     ||దేవుడే||

Daananda Maananda Maananda Mouga    ||Devude||


పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను

Parvathamulu Kadilina Nee – Yurvi Maaru Padinanu

సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్    ||అభయ||

Sarvamun Ghoshinchuchu Nee – Sandra Mupponginan    ||Abhaya||


దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును

Devudepdu Thodugaaga – Deshamu Vardhillunu

ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు   ||అభయ||

Aa Thaavu Nandu Prajalu Migula – Dhanyulai Vasinthuru    ||Abhaya||


రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన

Raajyamul Kampinchina Bhoo – Raashtramul Ghoshinchina

పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును    ||అభయ||

Poojyundou Yehovaa Vairi – Booni Samharinchunu   ||Abhaya||


విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన

Villu Virachu Naana Thega – Ballemu Naraku Naayana

చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే      ||అభయ||

Chella Chedara Jesi Ripula – Nelladrunchu Naayane   ||Abhaya||


పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును

Pishaachi Poorna Balamu Naatho – Benugulaada Jadiyunu

నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును   ||అభయ||

Nashinchi Shathru Ganamu Devu – Naazna Valana Madiyunu   ||Abhaya||


కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా

Kotayu Naashrayamunai Yaa – Kobu Devu Dundaga

ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ     ||అభయ||

Aeti Kinka Verava Valayu – Nepdu Naaku Banduga   ||Abhaya||