Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

సిలువ చెంత చేరిననాడు

కలుషములను కడిగివేయున్

పౌలువలెను సీలవలెను

సిద్ధపడిన భక్తులజూచి


కొండలాంటి బండలాంటి

మొండి హృదయంబు మండించు

పండియున్న పాపులనైన

పిలచుచుండే పరము చేర      ||సిలువ||


వంద గొర్రెల మందలోనుండి

ఒకటి తప్పి ఒంటరియాయే

తొంబది తొమ్మిది గొర్రెల విడిచి

ఒంటరియైన గొర్రెను వెదకెన్    ||సిలువ||


తప్పిపోయిన కుమారుండు

తండ్రిని విడచి తరలిపోయే

తప్పు తెలిసి తిరిగిరాగా

తండ్రియతని జేర్చుకొనియే     ||సిలువ||


పాపి రావా పాపము విడచి

పరిశుద్ధుల విందుల జేర

పాపుల గతిని పరికించితివా

పాతాళంబే వారి యంతము    ||సిలువ||